Header Banner

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

  Tue May 20, 2025 18:26        Politics

ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. ఈరోజు (మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం అంశంపై కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చింది. మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎవరు మాట్లాడవద్దని.. అనవసరంగా మాట్లాడితే మరో రకంగా వెళ్తుందని మంత్రులకు సీఎం తెలిపారు. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని... వాళ్ళ పని వాళ్ళని చూసుకోనివ్వాలన్నారు. మద్యం కుంభకోణంపై మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుందని... అందుకని దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సూచించారు. మద్యం కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి ఎవరు మాట్లాడవద్దని సీఎం స్పష్టం చేశారు.
వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి అవుతున్న సందర్భంగా సాధించిన విజయాలు, ప్రజలు మనోభావాలపై చర్చిద్దామని సీఎం అన్నారు. పంటలకు ఈ సారి ధరలు తగ్గాయని.. మానిటర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైజాగ్ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడటంపై మంత్రి స్వామిని సీఎం ప్రశ్నించారు. అలా జరగకుండా చూడాలని సీఎం కోరారు. రేషన్ సరఫరాకు ఎండీయూ వాహనాలను కేబినెట్ రద్దు చేసింది. వీటిపై తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లించి వాహనాల యజమానులకు ఇచ్చేయాలని నిర్ణయించింది. బియ్యం ఇచ్చే రోజు మినహా మిగతా రోజుల్లో వాళ్ళే వాడుకుంటున్నారని... ఇకపై రేషన్ బియ్యం రేషన్ దుకాణాల్లోనే ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వికలాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వాహనాల ద్వారా బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని పలువురు మంత్రులు.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ స్థానంలో నగదు ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చింది.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #liquor #scam #AP #cm #CBN #orders #cabinet #beti